‘నితిన్’కి 60 ఏళ్ళు.. ఎలా రిసీవ్ చేసుకుంటారో ?

‘నితిన్’కి 60 ఏళ్ళు.. ఎలా రిసీవ్ చేసుకుంటారో ?

Published on Feb 19, 2020 7:26 PM IST

హీరో నితిన్ ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అందులో ముందుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మా’తో ఈ నెల 21న రాబోతున్నాడు. ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా నితిన్ చేస్తోన్న మరో కొత్త సినిమా విషయంలో నితిన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొత్త విషయాలు చెప్పుకొచ్చాడు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న ‘పవర్‌ పేట’ సినిమాలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. పైగా ఆ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, అలాగే 40 ఏళ్ల వ్యక్తిగా, 60 ఏళ్ల ముసలాడిగా కూడా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమా తన కెరీర్ కే అరుదైన సినిమా అని అంటున్నాడు. సినిమా అరుదైనప్పటికీ నితిన్ 60 ఏళ్ల ముసలాడిగా అంటే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ప్రశ్న.

నితిన్ మాత్రం కృష్ణ చైతన్య రాసుకున్న స్క్రిప్ట్ పెద్ద స్పాన్‌ ఉన్న కథ అని.. మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుందని… ఇప్పటికే కథ కూడా రెడీగా ఉందని చెప్పాడు. అలాగే ఈ కథ 1960 – 2020 వరకూ నడుస్తోందట. ఆగష్టు నుండి ‘పవర్‌ పేట’ షూటింగ్‌ ను మొదలుపెడతానని నా కెరీర్‌లో ఈ సినిమా మోస్ట్‌ యాంబీషియస్‌ సినిమా అవుతుందని నితిన్ అంటున్నాడు. మరి నితిన్ నమ్మకాన్ని ఈ ‘పవర్‌ పేట’ నిలబెట్టుకుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు