షారుఖ్ సినిమా కోసం ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ

షారుఖ్ సినిమా కోసం ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ

Published on Oct 30, 2014 1:11 AM IST

happy-new-year
షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ అన్ని రికార్డులని బద్దలుకొడుతుంది. అయితే ఈ కామెడీ ఎంటర్టైనర్ మధ్యప్రదేశ్ లోని ఒక కుటుంబంలో విషాదం నింపింది. వివారాలలోకి వెళ్తే ఒక 21 ఏళ్ళ యువతి ఎక్కువ రద్దీ కారణంగా తన భర్త ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రానికి తీసుకువెళ్లలేదని ఒక బాటిల్ యాసిడ్ తాగింది.

ఆ జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ఇప్పుడు విషమంగా వుంది. ఫరహ్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనె, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు