అజిత్ సినిమాలో హీరోయిన్‌గా ఫెయిర్ అండ్ లౌవ్లీ బేబీ ?

అజిత్ సినిమాలో హీరోయిన్‌గా ఫెయిర్ అండ్ లౌవ్లీ బేబీ ?

Published on Dec 11, 2019 8:23 PM IST

యామీ గౌతమ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పేరుకి హీరోయినే అయినా ఫెయిర్ అండ్ లౌవ్లీ ప్రకటన ద్వారానే ఆమె అందరికీ సుపరిచితం. దక్షిణాదిలో సెటిలవ్వాలని తెలుగులో ‘గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్’, తమిళంలో ఒక సినిమా చేసిన ఆమెకు ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో హిందీలోనే అడపాదడపా సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిలైంది. అలాంటి ఆమెకు ఇప్పుడు తమిళంలో భారీ ఆఫర్ ఒకటి రాబోతుందని టాక్.

స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా హెచ్.వినోత్ ‘వాలిమై’ అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇందులో యామీని కథానాయకిగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టు కొలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే యామీకి సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చిన బెస్ట్ ఛాన్స్ ఇదే అవుతుంది. ఇకపోతే బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది వేసవికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు