ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫ్యామిలీ లోకి యష్.!

ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫ్యామిలీ లోకి యష్.!

Published on Mar 7, 2021 9:33 AM IST

ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 1” కూడా ఒకటి. మరి ఈ ఒక్క సినిమాతో చాలా మందికే భారీ ఫేమ్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా అయితే కన్నడ రాకింగ్ స్టార్ యష్ కు పాన్ ఇండియన్ లెవెల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇదే క్రేజ్ యష్ కు సోషల్ మీడియాలో కూడా గట్టిగానే ఉందని చెప్పాలి. లేటెస్ట్ గా తాను ఓ ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ ఎవర్ రికార్డును సెట్ చేసినట్టుగా కన్నడ వర్గాలు చెబుతున్నాయి.

కన్నడ లోని ఏ హీరోకి లేని విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫాలోవర్స్ ను రాబట్టుకున్న ఏకైక హీరోగా యష్ నిలిచాడని అతని అభిమానులు చెప్తున్నారు. అంతే కాకుండా అత్యధిక రీచ్ కూడా యష్ ఖాతాకే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఉందని చెబుతున్నారు. ఇలా ఫైనల్ గా యష్ ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫ్యామిలీ లోకి ఎంటర్ అయ్యాడని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం యష్ చేసిన “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు