స్టార్ హీరో సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్లు !

స్టార్ హీరో సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్లు !

Published on Jun 28, 2017 5:42 PM IST


దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన విలక్షణ నటుడు విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నట్చత్తిరం’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యొక్క టీజర్ కొద్దిరోజుల క్రితమే విడుదలై మంచి ఆదరణ పొందింది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉండేలా చూస్తున్నారు గౌతమ్ మీనన్.

అందుకే అలనాటి స్టార్ హీరోయిన్లు రాధిక, సిమ్రన్లను కీలక పాత్రల్లో నటింపజేస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ తో పాటు వీరిద్దరిపై కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. స్పై థ్రిల్లర్ గా ఉండనున్న ఈ సినిమా షూటింగ్ ను 22 రోజుల పాటు దుబాయ్, బల్గెరియా, టర్కీ, స్లోవేనియా వంటి దేశాల్లోని అందమైన లొకేషనల్లో చిత్రీకరించనున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాలో కనిపించని విధంగా ఈ లొకేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

హారిశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ కు జోడీగా ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ నటిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు