బాలయ్య కోసం ఇంకో హీరోయిన్ ని దించుతున్నారు !

బాలకృష్ణ ప్రస్తుతం తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఇప్పటికే నాయనతార, నటాషా దోషి లు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రంలో కథ పరంగా మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ మూడో హీరోయిన్ గా రెజీనాని ఎంపిక ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలిసారి రెజీనా బాలయ్య సరసన నటిచనుందనే ప్రచారం జరుగుతుండడంతో ఈ వార్త సర్వత్రా వ్యాపించింది.

 

Like us on Facebook