సంక్రాతి హిట్ కాంబో రిపీట్ కానుందా ?

సంక్రాతి హిట్ కాంబో రిపీట్ కానుందా ?

Published on Feb 22, 2017 4:29 PM IST


ఈ 2017 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప ఆరంభాన్ని అందించింది. విడుదలైన మూడు చిత్రాలు ‘ఖైదీ నెం 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానంభవతి’ మూడు భారీ విజయాలుగా నిలిచి పెద్ద మొత్తంలో లాభాల పంట పండించాయి. ఈ మూడింటిలో ‘శతమానంభవతి’ గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రెండు పెద్ద హీరోల చిత్రాలు రిలీజై, హిట్ టాక్ తెచ్చుకునప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విడుదలైన ఈ చిత్రం వాటితో పాటే సంక్రాంతి సక్సెస్ ను పంచుకుంది.

మళ్ళీ ఇప్పుడు ఇదే హిట్ కాంబో రిపీట్ కానుందట. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాత దిల్ రాజుతో కలిసి మరొక సినిమా చేయనున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా శతమానంభవతి తరహాలోనే పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని, దీనికి శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక సమాచారం, ఇతర చాష్త్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు