కేరళలో అల్లు అర్జున్ సినిమా సందడి మొదలైంది..!

కేరళలో అల్లు అర్జున్ సినిమా సందడి మొదలైంది..!

Published on May 27, 2016 1:25 AM IST

sarrainodu
అల్లు అర్జున్… తెలుగులో ఎంత పాపులారిటీ ఉందో అంత పాపులారిటీ కేరళలో కూడా ఉంది. అల్లు అర్జున్ సినిమా విడుదల అవుతుందంటే ఈ హడావుడి మరింత ఎక్కువ అవుతుంది. ’ఆర్య’ సినిమాతో అల్లు అర్జున్ అక్కడ మల్లు అర్జున్ గా మారిపోయాడు. అప్పటినుండి అల్లు అర్జున్ ప్రతి సినిమా అక్కడ కూడా విడుదల అయ్యేలా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కున్న క్రేజ్ కారణంగా ప్రతి సినిమా కూడా అక్కడ భారీగానే విడుదల చేస్తారు.

ఇక ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన ’సరైనోడు’ సినిమా ని మళయాలంలో ’యోధవ్’ పేరుతో రేపు విడుదల (మే 27) న విడుదల అవుతున్నది. ఈ సినిమా విడుదల సందర్భంగా అక్కడ అభిమానులు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. భారీ హోర్డింగులు,ఫ్లెక్సీలతో హంగామా సృష్టిస్తున్నారు. ఇక రేపు విడుదల అవుతున్న ఈ సినిమా అక్కడ మరెన్ని సంచనాలు రేపుతుందో చూడాలి. బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ పూర్తిస్థాయి మాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్, కాథరీన్ థ్రెసా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు