తాను నాగార్జున భక్తుడిని అంటున్న యువ నటుడు !

తాను నాగార్జున భక్తుడిని అంటున్న యువ నటుడు !

Published on Jan 23, 2017 6:10 PM IST

Saurabh-Raj
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ భక్తి రసా చిత్రం ఫిబ్రవరి లో విడుదలకు సిద్ధమవుతోంది. ఉత్తరాది యువ నటుడు సౌభా రాజ్ ఈ చిత్రం వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించనున్నాడు. కాగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సౌభా రాజ్ నాగార్జునతో కలసి నటించిన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సౌభా రాజ్ నాగార్జునని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ చిత్రం లో నాగార్జున తనకు భక్తుడుగా కనిపిస్తాడు కానీ రియల్ లైఫ్ లో తాను నాగార్జునకు భక్తుడనని ఈ యువ నటుడు తెలిపాడు.

నాగార్జున చిత్రాలు శివ, ఖుదా గావహ్ చిత్రాలు తనపై బాలీవుడ్ పై ప్రభావం చూపాయని తెలిపాడు. కాగా రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్య జైస్వాల్ లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు