నేను పవన్ కళ్యాణ్ మరదల్ని అంటున్న నటి ఎవరు ?

నేను పవన్ కళ్యాణ్ మరదల్ని అంటున్న నటి ఎవరు ?

Published on Sep 24, 2016 8:53 PM IST

manasa
పవన్ కళ్యాణ్ తో నటించాలని చాలా మంది హీరోయిన్లు, ఆర్టిస్టులు చాలా ఆతురతగా ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఆ ఛాన్స్ వస్తుందా అని చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. ఇక ఆ అవకాశం వస్తే వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ప్రసుతం ఇలాంటి ఆనందాన్నే ఓ నటి ఎంజాయ్ చేస్తోంది. ఊహించని విధంగా కనీసం ఆడిషన్స్ కూడా లేకుండా పవన్ సినిమా ‘కాటమరాయుడు’ లో ఛాన్స్ దక్కించుకుంది నటి ‘మానస హిమవర్ష’.

మోడల్ గా, డ్యాన్సర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా చేసే ఈమె ‘రొమాన్స్’ అనే సినిమాలో ఓ పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు పవన్ సినిమాలో ఆయనకు కొంటె మరదలిగా నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఈమె ప్రస్తావనే వినిపిస్తోంది. ఈ విషయాన్నే చెబుతూ ‘ఇందులో నేను పవన్ గారికి మరదలిగా నటిస్తున్నాను. పట్టు లంగా, ఓణీ, పరికిణీల్లో కనిపిస్తాను. ఎప్పుడెప్పుడు పవన్ గారిటి కలిసి నటిస్తానా అని ఆతురతగా ఉంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యే మొదలైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు