మెగా హీరోతో సినిమా లేదంటున్న యువ దర్శకుడు !
Published on Nov 13, 2017 6:38 pm IST

నాని తో ‘నిన్ను కోరి’ సినిమాను తెరకెక్కించి మంచి విజయం అందుకున్న యువ దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం రెండో సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. అయితే అయన తన రెండవ సినిమాను మెగా హీరో వరుణ్ తేజ్ తో డైరెక్ట్ చేస్తారని, ప్రముఖ నిర్మాత ఒకరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలొచ్చాయి.

కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శివ నిర్వాణ అన్నారట. తన రెండవ సినిమాపై వస్తున్న రూమర్లను నమ్మొద్దని, తానే స్వయంగా తన రెండవ ప్రాజెక్ట్ వివరాల్ని వెల్లడిస్తానని తెలిపారట. మరి ఈ యువ దర్శకుడు ఏ హీరో కోసం స్క్రిప్ట్ రాస్తున్నారో, అది ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఆయన్నుండే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.

 
Like us on Facebook