బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ రీమేక్ లో ఎనర్జిటిక్ స్టార్.?

బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ రీమేక్ లో ఎనర్జిటిక్ స్టార్.?

Published on Jul 5, 2015 3:46 PM IST

ram-m
2015 మే 29న మలయాళంలో రిలీజ్ అయిన ప్రేమమ్ సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ అని పించుకోవడమే కాకుండా మలయాళంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే అన్ని పాత సినిమాల రికార్డ్స్ ని స్మాష్ చేసి టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా దూసుకుపోతోంది. ఇకపోతే ఈ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ రైట్స్ ని స్రవంతి మూవీస్ బ్యానర్ అయిన స్రవంతి రవికిషోర్ సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా రీమేక్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తాడని అంటున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ రామ్ వాళ్ళదే కావడం వలన ఈ వార్తలు నిజమే అని కొందరు అంటున్నారు. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒక కుర్రాడి లైఫ్ లో వివిధ దశల్లో సంభవించిన ప్రేమకథలని చెప్పడమే ఈ సినిమా ప్రధాన కథాంశం. రామ్ ప్రస్తుతం శివం మరియు హరికథ సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తియిన తర్వాత ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు