త్రివిక్రమ్ సినిమాలో యంగ్ హీరో ?

త్రివిక్రమ్ సినిమాలో యంగ్ హీరో ?

Published on Mar 1, 2021 5:00 PM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీతారాగణం ఉంటుంది. పైగా ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక మిగిలిన నటీనటులు కూడా పెద్దవాళ్ళే ఉంటారు. అందుకే, ఈ సినిమాలో చిన్నచిన్న పాత్రలలో కూడా నటీనటులను పెద్దవాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాడట. ఈ క్రమంలో సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని.. దానికోసం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ మధ్యలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెడతాడని, నేటి రాజకీయాలలో ప్రజలు ఎలా బఫూన్ అవుతున్నారనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని నడిపిస్తాడని తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా విలన్ గా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు