ఫుల్ డిమాండ్ లో ఉన్న యంగ్ హీరోస్

ఫుల్ డిమాండ్ లో ఉన్న యంగ్ హీరోస్

Published on Jul 3, 2015 1:11 PM IST

nikhil
మొదటి సినిమా ఆఫర్ రావడం, ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న సులువైన పని. కానీ ఆ తర్వాత వచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టరరమైన పని. సోలో హీరోగా ప్రేక్షకులను మెప్పించాలంటే కథలను డిఫరెంట్ గా ఎంచుకోవాలి, కానీ అవి వారిని మెప్పించేలా ఉండాలి. అలాంటి కథలేనే సెలక్ట్ చేసుకుంటూ రీసెంట్ టైమ్స్ లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరోస్ ఇద్దరు ఉన్నారు.

ఆ ఇద్దరు యంగ్ హీరోస్ మరెవరో కాదు ఒకరు నిఖిల్ అయితే, ఇంకొకరు సందీప్ కిషన్. నిఖిల్ కమర్షియల్ అంశాలను అందిస్తూనే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య vs సూర్య సినిమాలతో హ్యాతిక్ హిట్స్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం శంకరాభరణం అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ కిషన్ కూడా సినిమా సినిమాకి స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా టైగర్ సినిమా మంచి హిట్ అయ్యింది.

ఇలా ఈ ఇద్దరు హీరోస్ ప్రస్తుతం టాలీవుడ్ లో తమదైన స్టైల్ లో సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. దాంతో వీరికి డిమాండ్ పెరిగింది. అలాగే వీరితో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు రావడం జరుగుతుండడం చాలా మంచిదనే చెప్పాలి. మరి ఈ ఇద్దరు హీరోలు ఇలానే తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు