ఆ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించాలని ఉందట !

anadi
తెలుగులో ‘బస్ స్టాప్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నటి ‘ఆనంది’ ఆ తరువాత తెలుగులో ‘ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి సినిమాలు చేసి తమిళ పరిశ్రమలోకి వెళ్ళిపోయింది. అక్కడ ‘కమల్, త్రిష ఇల్ల నయనతార, విశారణై’ వంటి హిట్ సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా నిలిచింది. అలాగే ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సినిమాలు చేసి మరో నాలుగు సినిమాలకి సైన్ చేసింది.

ఇలా వరుస సినిమాలతో దూసుకెళుతున్న ఈమె ఈ మధ్య ఒక సినిమా నుండి ఉన్నట్టుండి తప్పుకుంది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు ముందుగా చెప్పినట్టు సినిమాని తీయ్యడం లేదు అందుకే బయటికొచ్చేశానని, తనకు సినిమాలు ఒప్పుకోవడంలో పెద్ద తొందరేమీ లేదని, సినిమాలే తన ఫుల్ టైమ్ కెరీర్ కాదని అంటోంది. అలాగే తెలుగు, తమిళ పరిశ్రమల్లో పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయాలని ఉందని, అందులో ఆయనకు చెల్లెలిగా నటించాలనేది తన కోరికని అంది.

 

Like us on Facebook