శరవేగంగా సాగుతున్న యువనటుడి చిత్రం

శరవేగంగా సాగుతున్న యువనటుడి చిత్రం

Published on Apr 17, 2015 11:30 AM IST

rgv-sachin
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ హీరో సచిన్ జోషి కలసి పని చేస్తున్న రొమాంటిక్ హార్రర్ చిత్రం ‘ఏక్ ఎఫైర్’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం పోలాండ్ లో హీరో హీరోయిన్లపై ఒక రొమాంటిక్ పాట ని చిత్రీకరించారు.

‘ఏక్ ఎఫైర్’ తెలుగు మరియు హింది బాషలలో నిర్మిస్తున్నారు. సచిన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ‘ఫాటల్ అట్రాక్షన్’ ని స్ఫూర్తి గా తీసుకున్నారని సమాచారం. ఈ చిత్రం లో ‘బంగారం’ ఫేం మీరా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు