షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డైనమైట్’

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డైనమైట్’

Published on Apr 18, 2015 11:17 AM IST

Dynamite
‘వెన్నెల’, ‘ప్రస్థానం’ లాంటి అర్థవంతమైన సినిమాలను తెరకెక్కించిన దేవాకట్టా, ‘ఆటో నగర్ సూర్య’ సినిమా ద్వారా ఆ ప్రాభవాన్ని నిలబెట్టుకోలేకపోయారు. తాజాగా ఆయన తన పంథా మార్చి ఓ రీమేక్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరోగా నటిస్తూ ‘డైనమెట్’ పేరుతో స్వయంగా నిర్మిస్తున్నారు. 2014లో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’ సినిమాకు రీమేకే ఈ ‘డైనమైట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. నిన్నటివరకూ రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్లో ఓ పాట షూటింగ్ జరిగింది. దీంతో సినిమా షూటింగ్ పూర్తైనట్లేనని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో విష్ణు సరసన ప్రణీత హీరోయిన్‌గా నటిస్తోంది. తన సినిమా సినిమాకూ కొత్తదనమున్న పాత్రలతో దూసుకుపోతున్న విష్ణు ఈ సినిమాలో మరింత కొత్తగా కనిపించనున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు