‘ఎక్స్ ప్రెస్ రాజా’గా రానున్న యంగ్ హీరో

‘ఎక్స్ ప్రెస్ రాజా’గా రానున్న యంగ్ హీరో

Published on May 10, 2015 9:50 AM IST

Sharwanand
సినిమా సినిమాకి ఏదోఒక వైవిధ్యం చూపడానికి బాగా ఇష్టపడే యంగ్ హీరో శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని కెరీర్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాడు. శర్వానంద్ తన తదుపరి సినిమాని ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తొలి హిట్ అందుకున్న మేర్లపాక గాంధీతో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఓ టైటిల్ ని ఖారారు చేసారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాకి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా ఓ కొత్త భామ కోసం చాలా రోజుల నుంచి అన్వేషణ జరుపుతున్నారు. అందులో భాగంగా యంగ్ మోడల్ అయిన హిమని సిసోదియని ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మే చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు