ఆగిపోయిందనుకున్న యంగ్ హీరో సినిమా మొదలుకానుంది !


వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అందగాడు’ అనే సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మరొక సినిమా చేస్తున్నాడు. వీటిలో అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘అందగాడు’ సినిమా దాదాపు పూర్తి కావోస్తుండటంతో ఆయన ఆగిపోయిన తన పాత ప్రాజెక్ట్ ఒకదాన్ని తిరిగి మొదలుపెట్టాలని భావిస్తున్నాడు.

ఆ సినిమానే ‘రాజుగాడు’. గతేడాది నూతన దర్శకురాలు సంజన రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా మొదలైంది. అప్పుడు కొంత షూటింగ్ కూడా జరపగా రాజ్ తరుణ్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వలన దాన్ని అక్కడితో ఆపేసి కొత్త సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఫ్రీ అవడంతో ఈ సినిమాకు డేట్లు కేటాయించారట. ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్రముఖ దర్శకుడు మారుతి కథను అందించారు.

 

Like us on Facebook