‘ఎన్టీఆర్ 30’ బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది !

‘ఎన్టీఆర్ 30’ బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది !

Published on Feb 19, 2020 5:16 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పకడ్బంధీగా ప్లాన్ చేశారు. కాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బిగ్ ఎనౌన్స్ మెంట్ ను తాజాగా అధికారికంగా పోస్టర్ ను రిలిన్ చేస్తూ అనౌన్స్ చేసింది చిత్రబృందం. ఏప్రిల్ అండ్ మే నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ భారీ సినిమాని భారీ తారాగణంతో భారీ ఎత్తున నిర్మించనున్నారు.

ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవిందసమేత’ పెద్ద హిట్ కావడంతో తారక్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు…’ అని టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ టైటిలే వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంది.

అన్నట్టు రాజమౌళి సినిమా షూటింగ్ ముగియగానే తారక్ ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారట. ఇక చిత్రంలో కథానాయికలు, ఇతర తారాగణం ఎవరనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు