పవన్, ప్రభాస్ లతో నటించాలనుకుంటున్న కొత్త విలన్ !
Published on Feb 19, 2017 9:55 am IST


బాలీవుడ్ నుండి తెలుగు, తమిళ పరిశ్రమల్లోకి కొత్త హీరోయిన్లు తరచూ ఎలా వస్తుంటారో విలన్లు కూడా అలానే వస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన వ్యక్తి ఠాకూర్ అనూప్ సింగ్. మొదట పూరి జగన్నాథ్ ‘రోగ్’ చిత్రంలో నటించిన ఈయన ఆ సినిమా విడుదల కాకముందే సూర్య చేసిన భారీ ప్రాజెక్ట్ ‘సింగం 3’ లో విలన్ గా ఎంపికై తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో పాటే ఆయన ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉన్న సాయి ధరమ్ ‘విన్నర్’ చిత్రంలో సైతం విలన్ పాత్ర చేశారు.

నిన్న ‘సింగం 3, విన్నర్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ నగరానికి వచ్చిన అయన మీడియాతో మాట్లాడారు. తనకు ‘సింగం 3’ మంచి విజయాన్నిచ్చిందని, ‘విన్నర్’ సినిమాలో తాను వరల్డ్ నెం 1 జాకీగా నటిస్తున్నానని అన్నారు. అలాగే స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల్లో విలన్ పాత్రలు చేయాలని ఉందని, ఆ అవకాశం త్వరగా రావాలని అనుకుంటున్నానని, వాళ్ళతో కలిసి నటించడమంటే చాలా ఇష్టమని అన్నారు.

 
Like us on Facebook