రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ !

Published on Aug 17, 2017 9:30 AM IST


నాగ చైతన్య చేస్తున్న తాజా చిత్రం ‘యుద్ధం శరణం’ మేకింగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు అన్ని పనుల్ని ముగించిన చిత్ర యూనిట్ ప్రచార, విడుదల సన్నాహాలు చేస్తోంది. టీజర్ తో పాజిటివ్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితమే చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటుడు శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇకపోతే చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు