కొత్త ప్రాజెక్టుతో సిద్దమవుతున్న వైవిఎస్. చౌదరి !


‘దేవదాసు, సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి హిట్ సినిమాల్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు వైవిఎస్. చౌదరి గత దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నారు. 2015 లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఆయన రూపొందించిన ‘రేయ్’ కూడా పరాజయం పొందింది. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు కొత్త సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి ఆయన చేయబోయేది ఫ్రెష్ సబ్జెక్ట్ అని, అందులో నటించే హీరో హీరోయిన్లు కూడా కొత్తవాళ్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం నటీ నటుల ఎంపిక ఇంకా జరగలేదట. ఈ సబ్జెక్ట్ పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని వినికిడి. ఇకపోతే త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలను ఆయనే స్వయంగా ప్రకటిస్తారట.

 

Like us on Facebook