భారీ మొత్తానికి ‘హైపర్’ శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన టీవీ ఛానెల్

hyper-ram
ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హైపర్’ విడుదలకు ముందే బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తోంది. రామ్ చివరి చిత్రం ‘నేను శైలజా’ హిట్ కావడం, ఇప్పటికే విడుదలైన ‘హైపర్’ చిత్రం తాలూకు ట్రైలర్, పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందడంతో సినిమా విజయంపై మంచి ఖచ్చితత్వం ఏర్పడింది. దీంతో సినిమాకు అన్ని విధాలా మంచి బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే నైజాం, సీడెడ్, ఆంద్ర, ఓవర్సీస్ కు సంబందించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు మంచి ధరకు అమ్ముడవగా తాజాగా ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధర పలికాయి.

ప్రముఖ టీవీ ఛానెల్ ‘జీ తెలుగు’ ఈ హక్కులను రూ. 6.3 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. హీరో రామ్ కు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటం వలన జీ తెలుగువారు ఇంత పెద్ద మొత్తం వెచ్చించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదలకానుంది. ఇకపోతే ఈ చిత్రంలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తొయింది.

 

Like us on Facebook