కరోనా బారిన పడిన స్టార్ కపుల్ ఇంటికి చేరారు.

కరోనా బారిన పడిన స్టార్ కపుల్ ఇంటికి చేరారు.

Published on Mar 28, 2020 3:14 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ కరోనా వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల భార్యతో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన ఆయన అక్కడ కరోనా పాజిటివ్ గా తేలారు. అలాగే ఆయన భార్య రీటా విల్సన్ కూడా ఈ వ్యాధి బారిన పడడం జరిగింది. కాగా వీరిని అక్కడే రెండు వారాలు నిర్బంధంలో ఉంచడం జరిగింది. వీరు పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్నారు.

శుక్రవారం రాత్రి టామ్ హాంక్స్ మరియు అతని భార్య రీటా విల్సన్ అమెరికా చేరుకున్నారు. వారి సొంత నగరమైన లాస్ ఏంజెల్స్ కి వారు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక టామ్ హాంక్స్ నటించిన ఫారెస్ట్ గంప్ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా పేరుతో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు