మీరెవ్వరూ ఊహించలేనిదే ‘బాహుబలి’ – మిల్క్ బ్యూటీ

మీరెవ్వరూ ఊహించలేనిదే ‘బాహుబలి’ – మిల్క్ బ్యూటీ

Published on Jul 7, 2015 8:33 AM IST

tamanna
కాలేజీకి వెళ్ళాల్సిన రోజుల్లోనే ఫేస్ కి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తెలుగు, తమిళ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోస్ తో సినిమాలు చేసి వరుస విజయాలను అందుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ తమన్నా కెరీర్ అంతా ఒక ఎత్తు అయితే తను చేసిన బాహుబలి సినిమా మాత్రమే ఓకే ఎత్తు అని చెప్పాలి. ఎందుకు అంటే తమన్నా ఇప్పటి వరకే ఎక్కువగా గ్లామరస్ పాత్రలు, అడపాదడపా కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసింది. కనీ తన కెరీర్లో ఇప్పటి వరకూ చెయ్యని, ఇక చేయబోని అవంతిక పాత్రని బాహుబలిలో చేసింది.

మొట్ట మొదటి ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అయిన బాహుబలి జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా మాట్లాడుతూ ‘మామూలుగా మనం ఒక సినిమా ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఇలా ఉండబోతుందని కొంతవరకూ ఊహించవచ్చు. కానీ బాహుబలి విషయంలో మాత్రం మీరేమీ ఊహించలేరు. అస్సలు మీ ఊహకి అందని సినిమానే బాహుబలి’ అని తమన్నా తెలిపింది. తమన్నా ఈ సినిమాలో కేవలం గ్లామరస్ ప్రిన్సెస్ గానే కాకుండా కత్తి యుద్దాలు, ఇంటెన్స్ ఉన్న యువరాణి గా కూడా కనిపించనుంది. యంగ్ రెబల్ స్టార్ బాహుబలి, శివుడుగా కనిపించనున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి భళ్లాలదేవ గా కనిపించనున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు