సమీక్ష : గాలి సంపత్ – జస్ట్ ఓకే అనిపిస్తుంది

సమీక్ష : గాలి సంపత్ – జస్ట్ ఓకే అనిపిస్తుంది

Published on Mar 12, 2021 9:55 AM IST
 Gaali Sampath movie review

విడుదల తేదీ : మార్చి 11, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, సత్య, తనికెళ్ళ భరణి

దర్శకత్వం : అనీష్ కృష్ణ

నిర్మాత‌లు : సాహు గారపతి, హరీష్ పెడ్డి మరియు ఎస్ కృష్ణ

సంగీతం : అచ్చు

సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్

ఎడిటింగ్ : తమ్మిరాజు

ఇప్పుడిప్పుడే హీరోగా మంచి రోల్స్ తో నిలదొక్కుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. మరి ఇప్పుడు తాను హీరోగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి సమర్పణలో ఈ శివ రాత్రి కానుకగా మంచి బజ్ లో విడుదల కాబడిన చిత్రం “గాలి సంపత్”. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో పరిశీలిద్దాం రండి.

 

కథ :

 

సూరి(శ్రీ విష్ణు) మరియు తన తండ్రి గాలి సంపత్(రాజేంద్ర ప్రసాద్)లు అరకులో జీవించే సాదా సీదా తండ్రీ కొడుకులు. అయితే మొదటి నుంచి నటన పరంగా మంచి ఆసక్తితో ఉండే గాలి సంపత్ తన సంపాదనతో తన కొడుకు మంచి కోసమే ఏదోకటి చెయ్యాలి అని అనుకుంటుంటాడు కానీ కొన్ని అనుకోని కారణాల రీత్యా తన వల్లే తన కొడుకు జీవితం పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో ఈ ఇద్దరి నడుమ ఏర్పడిన గీత పెద్దదవుతుంది. మరి ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు విడిపోయే స్థాయి పరిస్థితి ఏం వచ్చింది? వీరిద్దరూ కలుసుకుంటారా లేదా? వీరిద్దరికీ ఎదురైన సవాళ్లు ఏంటి అన్నవి తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

తెలుగు సినిమాలో కొన్ని ఫ్యామిలీ రిలేషన్స్ లో తండ్రి మరియు కొడుకుల నేపథ్యంలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ కనిపిస్తే ఎమోషన్స్ అంతబాగా ఎలివేట్ అవుతాయి వాటిని మాత్రం ఈ చిత్రంలో ఒకింత ఎక్కువగాను ఎమోషనల్ గాను కనిపిస్తాయి. అయితే శ్రీ విష్ణు హీరో అయినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ తన రోల్ లో అద్భుతంగా చేసారని చెప్పాలి.

ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం తన ముఖ కవళికలతోనే తనలోని నటుణ్ని మరోసారి అవుట్ స్టాండింగ్ గా చూపించారు. అలాగే శ్రీ విష్ణుకి తనకి మధ్యలో ఉండే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వారిద్దరి నడుమ కెమిస్ట్రీ కూడా టచ్చింగ్ గా అనిపిస్తుంది. ఇది వరకే భిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించిన శ్రీవిష్ణు కొన్ని కలలు కలిగి ఉన్న కొడుకుగా ఆ తండ్రికి తగ్గ తనయుడిగా సింపుల్ అండ్ స్వీట్ సెటిల్డ్ నటనను కనబరిచాడు.

కొత్త హీరోయిన్ లవ్లీ సింగ్ విషయానికి వస్తే పేరుకు తగ్గట్టుగానే లవ్లీగా కనిపించి తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాయి వెళ్తుంది. అలాగే కమెడియన్ సత్యకు స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. రాజేంద్ర ప్రసాద్ తో తన నుంచి జెనరేట్ అయ్యే కామెడీ చాలా బాగుంటుంది. వీటితో పాటుగా ఈ చిత్రంలో క్లైమాక్స్ మంచి ఎఫెక్టీవ్ గా ఉంటుంది. దీనిని ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ అని కూడా చెప్పొచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలు చెప్పుకోదగ్గ లోటు పాట్లు చాలానే ఉన్నాయని చెప్పాలి. హీరోయిన్ రోల్ తక్కువగా రాసుకున్నారో తగ్గించారో కానీ శ్రీ విష్ణుకి లవ్లీ సింగ్ కు మధ్య కెమిస్ట్రీ ఏమంత గొప్పగా ఉన్నట్టు అనిపించవు తక్కువగా కూడా అనిపిస్తాయి. అలాగే కొన్ని లాజిక్స్ కూడా మిస్సయ్యినట్టు అనిపిస్తుంది.

వీటితో పాటుగా మరో డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే పెద్దగా వర్కౌట్ కానీ కామెడీ అనే చెప్పాలి. పైన చెప్పినట్టుగా సత్య మరియు రాజేంద్ర ప్రసాద్ ల మధ్య వచ్చే కామెడీ తప్పితే సినిమా మొత్తంలో డిజైన్ చేసుకున్న కామెడీ అంతా అవుట్ డేటెడ్ గా అనిపిస్తుంది దీనితో అవన్నీ ఒకింత బోరింగ్ గా అనిపిస్తాయి. అంతే కాకుండా ఇవన్నీ సినిమాపై ఏమాత్రం ఆసక్తిని తెప్పించవు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉంటాయి. ఈ చిత్రం అంతా అరకులో షూట్ చేసింది కాబట్టి సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది. అలాగే చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులో సంగీతం ఇచ్చిన అచ్చు కూడా డీసెంట్ జాబ్ అందించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సహా రాజేంద్ర ప్రసాద్ పై కొన్ని సన్నివేశాల్లో తన మ్యూజిక్ బాగుంటుంది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి కానీ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.

ఇక ఈ చిత్రానికి కీలక పాత్ర వహించిన దర్శకుడు అనీల్ రావిపూడి విషయానికి వస్తే తాను కూడా రైటింగ్ లో దర్శకుడు అనీష్ కృష్ణ కు హెల్ప్ చేశారు. మరి తాను కామెడీ సీన్స్ రాసారేమో కానీ మునుపటి మార్క్ అయితే కనిపించలేదు ఇది మాత్రం ఊహించింది అయితే కాదు. ఇక దర్శకుడు అనీష్ విషయానికి వస్తే దర్శకుడిగా నటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లను ఎమోషన్స్ ను రాబట్టుకోవడంలో సక్సీడ్ అయ్యాడు కానీ స్క్రిప్ట్ పరంగా కానీ పూర్తి స్థాయిలో సినిమాను ఎంగేజింగ్ గా నడపడం విషయంలో తడబడ్డాడు అని చెప్పక తప్పదు.

 

తీర్పు :

 

ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయతే ఈ “గాలి సంపత్” లో నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ అలాగే టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ల నుంచి ప్రామిసింగ్ పెర్ఫవుమెన్స్ లను వారి మధ్య మంచి ఎమోషన్స్ బలంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి తప్పితే సరైన కథా బలం లేకపోవడం ఆకట్టుకోని కామెడీ ఈ సినిమాపై ఇప్పటి వరకు మంచి ఒపీనియన్ ను పెట్టుకున్నవాళ్ళకి కాస్త నిరాశ కలిగిస్తుంది. దీని మూలాన ఈ కాంబో పై కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే చూడొచ్చు.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు