సమీక్ష : నందీశ్వరుడు- గమ్యం లేని చిత్రం

సమీక్ష : నందీశ్వరుడు- గమ్యం లేని చిత్రం

Published on Jan 15, 2012 8:55 PM IST
విడుదల తేది :15 జనవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 1.5/5
దర్శకుడు : శ్రీనివాస్ యరజల
నిర్మాత : కోట గంగాధర్
సంగిత డైరెక్టర్ : పార్థ సారధి
తారాగణం : నందమూరి తారకరత్న , షీనా శాహబడి , సుమన్ , రాజీవ్ కనకాల , నాగినీడు

నందమూరి తారక రత్న నటించిన చిత్రం “నందీశ్వరుడు” ఈరోజు విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని కోట ఫిలిం కార్పోరేషన్ నిర్మించగా శ్రీనివాస్ యరజల దర్శకత్వం వహించారు. ఇందులో షీన కథానాయికగా నటించింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

డేడ్లి సోమ చిత్రం స్ఫూర్తి తో వచ్చిన ఈ చిత్రం లో నందు అనే పాత్ర విద్యార్థిగా ఉంటారు. ఈ పాత్ర పోలిస్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. తన తల్లి తండ్రులు మాత్రం తనకి మంచి జీవితం రావాలని కోరుకుంటూ ఉంటారు అందరితో గొడవ పడే అలవాటుండే నందు ఒకానొక పరిస్థితి లో బాబా(అజయ్) తో గోడవపడాల్సి వస్తుంది దానికోసం అతను జైలు కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటి నుండి జనం కోసం బ్రతకడం మొదలు పెడతాడు.నగరం లో ఉన్న దాదా లను పట్టుకోడానికి ప్రబుత్వం ఈశ్వర్(జగపతి బాబు) ని నియమిస్తుంది నందీశ్వరుడు కి బాబా కి జరుగుతున్న పోరాటం లో ఎవరో ఒకరే విజయం సాదించాలి ఎవరు సాదించారు అనేది మిగిలిన కథ.

ప్లస్:

గత చిత్రాలతో పోల్చుకుంటే తారక రత్న నటన చాలా మెరుగుపడింది షీన కూడా కథానాయికగా బాగా చేసింది అందాల ఆరబోత బాగానే చేసింది ఈశ్వర్ పాత్రలో జగపతి బాబు బాగా చేసారు కాస్త “లక్ష్యం” చాయలు కనిపించిన పాత్రకు న్యాయం చేసారు. బాబా పాత్ర లో అజయ్ పరవాలేదు అనిపించగా సీత మరియు సుమన్ పరిధికి తగ్గటు బానే చేసారు.

మైనస్ :

తారక రత్న పాత్ర మీద కాస్త జాగ్రతలు తీసుకొని ఉంటే బాగుండేది స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా వుంది ఓపిక ను పరీక్షిస్తుంది.మొదటి సగం లో అనవసరమయిన పాటలు మరియు సన్నివేశాలు ఉన్నాయి కత్తిరించుంటే బాగుండేది. చిత్రంలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి. షీన మరియు తారక్ మద్య నడిపించిన కథ బాలేదు. మెలోడ్రామా కాస్త ఎక్కువయ్యింది .అనవసరమయిన నీతి వాక్యాలతో జనాన్ని విసిగించారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి

టెక్నికల్ విభాగం:

పోరాట సన్నివేశాలు రెండవ అర్ధం లో పరవాలేదు అనిపించగా ఎడిటింగ్ ఇంకా బాగా చెయ్యాల్సి వుంది నృత్యాల లో చెప్పుకోవాల్సింది ఏమి లేదు సినిమాటోగ్రఫీ పరవాలేదు డైలాగు పరవాలేదు నేఫధ్య సంగీతం బాగుంది కాని సంగీతం బాలేదు.

తీర్పు:

తారక రత్న చాలా బాగా నటించిన స్క్రిప్ట్ మరియు కథ లో బలం లేకపోటం వల్ల ఓపికను పరీక్షిస్తుంది.నందీశ్వరుడు ఒక గమ్యం లేని చిత్రం గా అనిపిస్తుంది. దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

అనువాదం రV

123తెలుగు.కాం రేటింగ్: 1.5/5

Clicke Here For Nandeeswarudu English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు