సమీక్ష : దర్శనం అవసరం లేని క్షేత్రం

సమీక్ష : దర్శనం అవసరం లేని క్షేత్రం

Published on Dec 30, 2011 1:52 AM IST
విడుదల తేది : 29 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 2/5
డైరెక్టర్ : టి. వేణు గోపాల్
ప్రొడ్యూసర్ : జి. గోవిందరాజులు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
నటీ నటులు: జగపతి బాబు, ప్రియమణి , కిక్ శ్యాం, ఆదిత్యా మీనన్, కోట శ్రీనివాస రావు

ప్రియమణి మరియు జగపతి జంటగా కిక్ శ్యామ్ తో కలిసి నటించిన చిత్రం క్షేత్రం. టి. వేణుగోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోవింద రాజులు నిర్మాత.
ఈ చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ చూద్దాం.

కథ:

క్షేత్రం కథ విషయానికి వస్తే గ్రామ పెద్ద నరసింహ రాయలు (జగపతి బాబు), అతని భార్య లక్ష్మి (ప్రియమణి) మరియు వారి కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతుంది. తన ఊరికి మంచి జరగాలంటే ఆ గ్రామంలో ఉండే గుడిలో పూజ చేయించాలని ప్రత్నించిన ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది. తన పేరు పెంచలయ్యగా మార్చుకుంటే పూజ జరుగుతుందని పూజారులు సూచించడంతో అలగే మార్చుకుంటాడు నరసింహ రాయలు. ఈ సారి కూడా పూజ జరగకుండా నరసింహ రాయలు చిన్నాన్న (కోట శ్రీనివాస రావు) మరియు అతని బావ విశ్వనాధ రాయలు (ఆదిత్య మీనన్) కుట్ర పన్ని పూజ జరగనివ్వరు. ఇది జరిగిన చాలా రోజుల తరువాత విశ్వనాధ రాయలు కొడుకు చక్రి (కిక్ ఫేం శ్యాం) సోహిని (ప్రియమణి) చూడగానే ప్రేమిస్తాడు. సోహిని చక్రి ఇంటికి వచ్చిన తరువాత ఆమెలోకి ఆత్మలు ప్రవేశించడం సోహిని వింతగా ప్రవర్తించడం జరుగుతుంటాయి. సోహిని అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? చివరికి ఆ గ్రామలో పూజ పూర్తయిందా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

ప్రియమణి బాగా యాక్టింగ్ చేసింది. ఆమె నటనే సినిమాను కొంత వరకు కాపాడగలిగింది. సినిమా సెకండాఫ్ లో ఆమె చాలా బాగా చేసింది. ఇంత మంచి నటన ఉన్న నటి కూడా ఇలాంటి సినిమాలో వేస్టయిపోయింది. ఆచారిగా తనికెళ్ళ భరణి నటన పర్వాలేదు. ఆదిత్యా మీనన్ కూడా పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించాడు. కోట శ్రీనివాస రావు ఓకే. ఆయనకి ఇచ్చిన పాత్రకి ఆయన న్యాయం చేయడానికి ప్రయత్నించారు.

మైనస్ పాయింట్స్:

జగపతి బాబు మంచి నటుడు. ఇలాంటి పాత్రలు అంగీకరించకుండా ఉంటే చాలా మంచిది. ఈ పాత్రని పవర్ఫుల్ గా చూపించడానికి శత విధాల ప్రయత్నించాడు. కారక్టరైజేషన్ సరిగా లేక డైలాగులు సిల్లీగా ఉండటంతో పేలవంగా మారిపోయాడు. కిక్ ఫేం శ్యాం కూడా మంచి నటుడు. ఇలాంటి సినిమాలో అతని పాత్ర అస్సలు బాగాలేదు. బ్రహ్మానందం పాత్ర అస్సలు బాగాలేకపోగా సిల్లీగా కూడా ఉంది. హేమ మరియు సురేఖ వాణిల పాత్రలు కూడా బాగా లేవు. బ్రహ్మాజీ లాంటి టాలెంట్ ఉన్న నటుడిని కూడా దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. రాజీవ్ కనకాలని అలాగే వాడుకోలేకపోయారు. మిగతా నటులు కూడా కొద్దిసేపు అలా కనిపించి వెళ్తారు.

అరుంధతి మరియు చంద్రముఖి సినిమాల కథ నుండి ఈ చిత్ర కథ తయారు చేసారు. చాలా సన్నివేశాలు ఆ సినిమాలని గుర్తు చేస్తాయి. పాత్రల వేషధారణ మరియు అవి ప్రవర్తించే తీరు
ఆ సినిమాలే చూస్తున్నామా అనిపిస్తుంది. డైరెక్షన్ అస్సలు బాగా లేదు. చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయి. ఉదాహరణకు జగపతి బాబు పెంచలయ్య గా పేరు మార్చుకున్న వెంటనే పాటలో అతనిని గ్రామ ప్రజలంతా పాత పేరుతోనే పోగిడేస్తుంటారు.

సాంకేతిక విభాగం:

స్క్రీన్ప్లే అస్సలు బాగా లేదు. ఎడిటింగ్ సరిగా లేకపోగా సినిమాకి మైనస్ గా మారింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు గ్రాఫిక్స్ ఓకే. పాటలు కూడా బాగాలేవు. సినిమా నుండి బైటికి
వచ్చాక ఒక్క పాట కూడా గుర్తు లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా చెత్తగా ఉంది. డైలాగ్స్ పాత చింతకాయ పచ్చడి. 1980 లలో వచ్చే సినిమాలలోని డైలాగుల్లా ఉన్నాయి.

తీర్పు:

క్షేత్రం సినిమా అరుంధతి మరియు చంద్రముఖి సినిమాలతో తయారు చేసిన చేసిన బ్యాడ్ కిచిడి లా మారిపోయింది. అలాంటి మంచి చిత్రాల కథలను ఇలాంటి చిత్రాలకు అనవసరంగా
వాడుకున్నారు. ఈ సినిమాని మంచి డైరెక్టర్ తీసి ఉంటే కీసం బి, సి సెంటర్లలో ఆడేది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి నచ్చే అంశాలు ఏమీ లేవు.

అనువాదం – అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్: 2/5

Kshetram Review English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు