సమీక్ష : ప్రతి ఘటన – ఫస్ట్ హాఫ్ హిట్, సెకండాఫ్ ఫ్లాప్.!

సమీక్ష : ప్రతి ఘటన – ఫస్ట్ హాఫ్ హిట్, సెకండాఫ్ ఫ్లాప్.!

Published on Apr 18, 2014 7:00 PM IST
Prathighatana-review విడుదల తేదీ : 18 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : తమ్మారెడ్డి భరద్వాజ్
నిర్మాత : తమ్మారెడ్డి భరద్వాజ్
సంగీతం:ఎం.ఎం కీరవాణి
నటీనటులు: చార్మీ, రేష్మ, పోసాని..

సొసైటీలో జరిగే ఏదో ఒక సమస్యని తీసుకొని దాని చుట్టూ కథని అల్లుకొని, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసే డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్. ఆయన ఒరిస్సాలో జరిగిన ఓ యదార్థ గాదని ఆధారంగా చేసుకొని చేసిన సినిమా ‘ప్రతి ఘటన’. చార్మీ ఒక జర్నలిస్ట్ గా లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో రేష్మ ఓ కీలక పాత్ర పోషించింది. గతంలో సూపర్ హిట్ అయిన ‘ప్రతి ఘటన’ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆ రేంజ్ విజయాన్ని అందుకునేలా ఉందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

టీవీ 5 లో ఒక సిన్సియర్ రిపోర్టర్ నిశ్చల(చార్మీ). ఆమె ఒక విలేజ్ లో జరిగిన అమ్మాయి రేప్ కేసుపై పోరాటం మొదలు పెడుతుంది. ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు నిశ్చల చాలా మంది గురించి తెలుసుకుంటుంది. అప్పుడే ఆ రేప్ కి గురైన అమ్మాయి ఫ్రెండ్ శాంతి(రేష్మ)తో పరిచయం అవుతుంది.

ఆ తర్వాత ఆ రేప్ లో చాల మంది రాజకీయనాయకుల హస్తం ఉందని తెలుసుకున్న నిశ్చల అతను ఎవరో ప్రజల ముందుకు తీసుకు రావాలని, అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ఎదురుగా పోరాడాలి అనుకుంటుంది. ఇవన్నీ చేయడానికి నిశ్చల ఏం చేసింది? తనకి ఎవరు సాయం చేసారు? తను అనుకున్నది చివరికి సాదించిందా? లేదా అన్నది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

టీవీ 5 రిపోర్టర్ గా చార్మీ చాలా సూపర్బ్ పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. ముఖ్యంగా బాగా ఎమోషనల్ గా చేయాల్సిన రెండు సీన్స్ లో చాలా చక్కని నటనని కనబరిచారు. రేష్మ ఫస్ట్ హాఫ్ లో చాలా చక్కని నటనని కనబరచడమే కాకుండా ఫస్ట్ హాఫ్ లో అందరినీ తన పాత్రతో ఆకట్టుకుంది. అలాగే డైరెక్టర్ ఎంచుకున్న పల్లెటూరి అమ్మాయి పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయింది.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా చూడటానికి ఆసక్తికరంగా ఉంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంది. ముఖ్యంగా స్లో మోషన్ లో షూట్ చేయడం, దానికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతుల్ కులకర్ణి పెర్ఫార్మన్స్ బాగుంది అలాగే సెకండాఫ్ ని అతనే సేవ్ చేసాడు. ఈ సినిమాలో మహిళపై జరుగుతున్న అత్యాచారాలను చాలా బాగా చూపించారు. పోసాని కృష్ణమురళి పోలీస్ ఆఫీసర్ గా కాసేపు నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

మొత్తంగా చూసుకుంటే ఇదొక సీరియస్ సబ్జెక్ట్. కానీ సెకండాఫ్ లో సీరియస్ ఫిల్మ్ గా కాకుండా కాస్త ఫన్నీగా తీయాలని ట్రై చేసారు. ఈ సినిమాలో అందరూ వెతుకుతున్న మెయిన్ విలన్ ని చాలా సింపుల్ గా కామెడీగా చూపించారు. అది అంత కనెక్ట్ అయ్యేలా లేదు. కీలక పాత్ర చేసిన రఘుబాబు పాత్ర అంత కనెక్ట్ అయ్యేలా లేదు. ఇలాంటి సీరియస్ పాయింట్స్ ని డీల్ చేసే సినిమాలకి ఇలాంటి పాత్రలు చేయడానికి సీరియస్ నటులని తీసుకొని ఉంటే బాగుండేది. సినిమాకి సంబంధం లేని సీన్ లో వచ్చిన బ్రహ్మానందం అస్సలు ఆకట్టుకోలేకపోయాడు.

మాములుగా ఒక రేప్ అమ్మాయి పాత్రని డీల్ చేసేప్పుడు ఆడియన్స్ లో కాస్త సింపతీని క్రియేట్ చేసేలా ఉండాలి కానీ అది క్రియేట్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండాఫ్ ని ఆ రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేక సినిమాని సాగదీశారు. చార్మీ చక్కని నటనని కనబరిచినా ఆమె ఓన్ డబ్బింగ్ మాత్రం పెద్దగా సెట్ అవ్వలేదు. ఇలాంటి సీరియస్ రోల్ కి వేరే ఎవరి చేతనైనా డబ్బింగ్ చెప్పించి ఉంటె బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, అలాగే చాలా నీట్ గా కూడా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కూడా ఓకే కానీ సెకండాఫ్ మీద కాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే ఫ్లో మిస్ అయ్యింది. మ్యూజిక్ ఓకే అనేలా ఉంది.

తమ్మారెడ్డి భరద్వాజ్ మంచి సబ్జెక్ట్ ని ఎంచుకున్నారు కానీ దాన్ని ఎలివేట్ చేసి చూపించడంలో మాత్రం అనుకున్న రేంజ్ కి తీసుకెళ్ల లేకపోయారు. ఇది వరకూ చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా ఉన్నా సెకండాఫ్ మాత్రం నిరుత్సాహపరిచింది.

తీర్పు :

ఓవరాల్ గా చెప్పాలి అంటే ‘ప్రతి ఘటన’ కి మంచి స్క్రిప్ట్ కుదిరింది, కానీ టేకింగ్ కి వచ్చే సరికే అది మిస్ అయ్యింది. ఛార్మి, రేష్మల పెర్ఫార్మన్స్, ఆసక్తిగా సాగే ఫస్ట్ హాఫ్ సినిమాకి ప్లస్ అయితే కాస్ట్ డల్ అయిపోయిన సెకండాఫ్ సినిమాకి మైనస్. ఓవరాల్ గా ఓ మంచి ఉద్దేశంతో తీసిన సినిమాలను చూడాలనుకునే వారందరూ చూడదగిన సినిమా ‘ప్రతి ఘటన’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు