సమీక్ష : ట్రాఫిక్ – ప్రేక్షకులని కట్టిపడేసే సస్పెన్స్ డ్రామా..

సమీక్ష : ట్రాఫిక్ – ప్రేక్షకులని కట్టిపడేసే సస్పెన్స్ డ్రామా..

Published on Feb 15, 2014 3:15 AM IST
Traffic విడుదల తేది : 14 ఫిబ్రవరి 2014
123123తెలుగు .కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : షాహిద్ ఖాదర్
నిర్మాతలు : తుమ్మలపల్లి రామసత్యనారాయణ
సంగీతం: మెజో జోసెఫ్
నటినటులు : శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, రాధి …

గత సంవత్సరం ‘చెన్నయిల్ ఒరునాల్’ అనే పేరుతో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో ‘ట్రాఫిక్’ పేరుతో డబ్ చేసి ఈ రోజు రిలీజ్ చేసారు. సౌత్ స్టార్స్ అయిన సూర్య, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, రాధిక, చేరన్, ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి షాహీద్ కాధర్ డైరెక్టర్. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సత్యమూర్తి(చేరన్) నిజాయితీగల ట్రాఫిక్ కానిస్టేబుల్. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల లంచం తీసుకుంటూ దొరికిపోయి సస్పెన్సన్ లో ఉంటాడు. కార్తీక్ జెమిని టీవీ జర్నలిస్ట్. ఓ రోజు తన ఫేవరైట్ హీరో అయిన గౌతమ్ కృష్ణ(ప్రకాష్ రాజ్) ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళుతుండగా యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ డెడ్ పేషంట్ అవుతాడు.

అదే టైంలో గౌతమ్ కృష్ణ కూతురు ఎమర్జెన్సీగా హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వెతికితే కార్తీక్ హార్ట్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని తెలుస్తుంది. గౌతమ్ కృష్ణ భార్య(రాధిక) కార్తీక్ వాళ్ళ తల్లి తండ్రులని బతిమిలాడి హార్ట్ దానం చేయడానికి ఒప్పిస్తుంది.

అంతవరకూ బాగానే సాగినా అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. గౌతమ్ కుమార్తె కోదాడ హాస్పిటల్లో ఉంటుంది. కార్తీక్ ఏమో హైదరాబాద్ లో ఉంటాడు. ఆ హార్ట్ ని అక్కడి నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి వాతావరణం సహకరించకపోవడంతో హెలి కాఫ్తర్ ద్వారా కాకుండా, రోడ్డు ప్రయాణం ద్వారా 90 నిమిషాల్లో హైదరాబాద్ నుండి కోదాడకి హార్ట్ చేర్చాల్సి వస్తుంది.

అప్పుడు ఆ మిషన్ ని డీల్ చేసే బాధ్యత పోలీస్ కమీషనర్ సుందర్ (శరత్ కుమార్) తీసుకుంటాడు. అతను ఆపరేషన్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆ మిషన్ ని పూర్తి చేయడానికి డ్రైవర్ గా సత్య మూర్తిని, డాక్టర్ రాబిన్(ప్రసన్న), కార్తీక్ ఫ్రెండ్ అజ్మల్ ని ఎంచుకుంటారు.

ఈ మిషన్ కోసం అన్ని చోట్లా రోడ్లని బ్లాక్ చేస్తారు. అలా బ్లాక్ చేసిన తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన జర్నీ సాఫీగా సాగిందా? లేదా? ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదా? అనేది మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

తమిళ్ హీరో సూర్య ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో మాత్రమే కనిపిస్తాడు, కానీ ఆతని స్పెషల్ అప్పియరెన్స్ సినిమాని ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడింది. పోలీస్ కమీషనర్ పాత్రలో శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ సూపర్బ్ గా ఉంది. అలాగే సత్యమూర్తి పాత్ర పోషించిన చేరన్ నటన కూడా బాగుంది.

ప్రకాష్ రాజ్ – రాధిక తమకిచ్చిన పాత్రకి న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇంకా చాలా మంది తమిళ నటీనటులు నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. సినిమాలో జర్నీ అనేది స్టార్ట్ అయిన తర్వాత సినిమా వేగం అనేది ఎక్కడా తగ్గదు. ఈ కథలోనే మరో చిన్నకథగా పెట్టిన ప్రసన్న స్టొరీని కూడా కథకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిపారు.

ఇంటర్వల్ ఎపిసోడ్ చాలా బాగుంది, అది ఆడియన్స్ కి తరువాత ఏమి జరుగుతుందా అనే ఉత్కంఠని కలిగించింది. సినిమాలో ప్రతి పాత్రలోని ఎమోషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే సినిమా రెండు గంటలే ఉండడం సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్ :

ఈ సినిమా కోసం ఎంచుకున్న ప్లాట్ కొన్ని సందర్భాల్లో అంత రియలిస్టిక్ గా అనిపించదు. పోలీసులేమో వాతావరణం బాగోలేదు హెలికాఫ్టర్ వాడడం చాలా కష్టం అంటారు. కానీ జర్నీ అప్పుడు వాతావరం అంతా బాగున్నట్టు చూపిస్తారు. ఒక చిన్న సమస్య వల్ల వారి జర్నీ ఆగిపోతుంది. కానీ వారు 90 నిమిషాల్లోనే 180 కిమీ ట్రావెల్ చేస్తారు. అది కాస్త నమ్మశక్యంగా లేదు. ఎక్కువ మంది తమిళ్ ఆర్టిస్ట్ లు ఉండడం మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని మిస్ అవ్వడం వల్ల బి,సి సెంటర్స్ లో సినిమా ఆడే అవకాశం కాస్త తక్కువ.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా విషయంలో ఎడిటర్ పనితనం చాలా బాగుంది. ఆడియన్స్ ని సీట్లో నుంచి కదలకుండా చేసేలా సెకండాఫ్ ఎడిట్ చేసాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎక్కడా కథని పక్కకి పోనివ్వకుండా తీయడంలో మరియు ఇలాంటి కానెప్త్ ని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా తీసినందుకు డైరెక్టర్ షాహీద్ ని మెచ్చుకోవాలి.

తీర్పు :

రెండు గంటలపాటు మిమ్మల్ని కట్టి పడేసే మంచి సపెన్స్ డ్రామా ‘ట్రాఫిక్’. నటీనటుల మంచి పెర్ఫార్మన్స్, వేగంగా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్. తెలుగులో ఎక్కువగా తమిళ్ నేటివిటీ కనపడడం, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వాళ్ళ బి, సి సెంటర్స్ లో కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే ‘ట్రాఫిక్’ సినిమా అందరూ చూడదగిన సినిమా. మీరు పెట్టిన టికెట్ ధరకి పూర్తి సంతృప్తిని ఇచ్చే సినిమా ‘ట్రాఫిక్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు