సమీక్ష : విచక్షణ – కథ బాగుంది., కానీ..

సమీక్ష : విచక్షణ – కథ బాగుంది., కానీ..

Published on Apr 8, 2014 1:10 AM IST
vichakshana1 విడుదల తేదీ : 4 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : దీపక్ న్యాతి
నిర్మాత : దీపక్ న్యాతి
సంగీతం : జగన్నాథ్ సెంది
నటీనటులు : ధీరజ్, పద్మిని..

పలు సంవత్సరాలు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దీపక్ న్యాతి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘విచక్షణ’. ప్రస్తుతం మన గవర్నమెంట్ అధికారులు చేస్తున్న అన్యాయాలను అరికట్టాలనే పాయింట్ ని తీసుకొని చేసిన ఈ విచక్షణ సినిమా ద్వారా ధీరజ్, పద్మిని హీరో హీరోయిన్స్ గా పరిచయమయ్యారు. ఈ విచక్షణ సినిమా ప్రేక్షకుల్లో చైతన్యం కలిగించేలా ఉందా? లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

విరాట్(ధీరజ్) ఒక కొరియర్ బాయ్. అతనికి మొత్తం 5 మంది ఫ్రెండ్స్. ఈ ఆరుగురికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అలా ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న విరాట్ కి సృజన(పద్మిని)తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అప్పుడే లంచాలకి అలవాటు పడిపోయిన ఆ ప్రభుత్వ అధికారులు చేసే మోసం వల్ల విరాట్ కి రావాల్సిన గవర్నమెంట్ జాబు రాదు, అలాగే లంచం తీసుకొని మోసం చేయడంతో విరాట్ ఫ్రెండ్ రాహుల్ తల్లి తండ్రులు చనిపోతారు.

దాంతో ఈ వ్యవస్థ మీద కోపం వచ్చిన విరాట్, అతని ఫ్రెండ్స్ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను, రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టి తమ ఖజానా నింపుకుంటున్న వాస్తవాలను ప్రజలకు చూపించి ప్రజల్లో చైతన్యం చేయాలనుకుంటారు. దాని కోసం విరాట్ అతని ఫ్రెండ్స్ ఏమి చేసారు అన్నదే మిగిలిన కథాంశం..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ డైరెక్టర్ ఎంచుకున్న స్టొరీ లైన్ మరియు దాన్ని రాసుకున్న విధానం. తను అనుకున్న పాయింట్ ని సెకండాఫ్ లో బాగా చూపించాడు. హీరోగా ధీరజ్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ నటనలో మంచి మార్కులే కొట్టేసాడు. డాన్సులు, ఫైట్స్ బాగా చేసిన ధీరజ్ కామెడీ చేయడంలో మరియు ఇంకొన్ని విషయాల్లో ఇంకాస్త ట్రైనింగ్ తీసుకోవాలి. మంచి డైరెక్టర్ చేతిలో పడితే తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది.

హీరోయిన్ పద్మిని తన పాత్రలో పరవాలేదనిపించింది. సెకండాఫ్ లో అవినీతి నాయకులను ప్రజలకు చూపించదానికి ఎంచుకున్న విధానం, దాని డీల్ చేసిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మొదటి మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్. డైరెక్టర్ తను అనుకున్న పాయింట్ లో 95% ని సెకండాఫ్ లోనే చూపించాడు. కావున దానికి లీడింగ్ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటది. కానీ డైరెక్టర్ కథా పరంగా ఆ లీడింగ్ సీన్స్ ని క్రియేట్ చేయకుండా కమర్షియల్ పాయింట్స్ ని కొన్ని జత చేయాలని పాటలని ఎక్కువ పెట్టేసారు. దానివల్ల ఫస్ట్ హాఫ్ ని బాగా సాగాదీసేసారు.అలా లేకుండాకేవలం కాన్సెప్ట్ ని మాత్రమే డీల్ చేసుంటే సినిమా రన్ టైం తగ్గేది, అలాగే సినిమా ఇంకాస్త స్పీడ్ గా, ఆసక్తికరంగా ఉండేది.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది అలాగే వరుసగా పాటలు వచ్చేయడం ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిస్తుంది. సినిమాలో మరీ లో బడ్జట్ తో తీయడం వల్ల ఎలివేట్ చేయాల్సిన సీన్స్ ని సరిగా ఎలివేట్ చేయలేదు. అలాగే కొన్ని పాత్రలకి సరైన ముగింపు లేదు.

సాంకేతిక విభాగం :

సాకేతిక విభాగంలో సినిమాటోగ్రాఫర్ నాగరాజ్ తనకు ఇచ్చిన లోకేషన్స్ ని బాగా చూపించాడు. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ మీద కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఇక మిగిలిన డిపార్ట్ మెంట్స్ అయిన కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – ఫైట్స్ – నిర్మాత – దర్శకత్వ బాధ్యతలను సింగల్ హ్యాండ్ తో దీపక్ న్యాతి డీల్ చేసాడు. ఇన్ని డిపార్ట్ మెంట్స్ ని ఒక్కరే డీల్ చేసినప్పుడు ఏదో ఒక డిపార్ట్ మెంట్ లో తప్పులు జరుగుతుంది. అదే విషయం ఇక్కడా జరిగింది. వీటి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే . కథ – బాగుంది, స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ డమ్మీ, సెకండాఫ్ ఓకే, డైలాగ్స్ – బిలో యావరేజ్, ఫైట్స్ – యావరేజ్, నిర్మాణ విలువలు – యావరేజ్, డైరెక్షన్ – అబో యావరేజ్. ఓవరాల్ గా దీపక్ న్యాతి ఓకే అనిపించాడు.

తీర్పు :

ప్రజల్లో చైతన్యం కలిగించాలని చేసిన ‘విచక్షణ’ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేధనిపించుకునేలా ఉంది. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ అయినప్పటికీ దాన్ని సరిగా డీల్ చేయకపోవడం, ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠని కలిగించలేకపోవడం వల్ల పరవాలేధనిపించుకునే స్థాయికే ఈ సినిమా పరిమితమయ్యింది. సినిమాకి ఎంచుకున్న కథ బాగుంది, కానీ పూర్తిగా ఎలివేట్ చేయలేకపోవడం మైనస్. ఈ మధ్య కొంతమంది నటీనటులు చేస్తున్న పెర్ఫార్మన్స్ కంటే పరవాలేదనిపించే నటీనటుల పెర్ఫార్మన్స్, సెకండాఫ్ ఈ సినిమాలో చూడదగిన ప్లస్ పాయింట్స్.
కామెడీ లేకపోవడం, స్లోగా అనిపించే ఫస్ట్ హాఫ్ సినిమాకి మైనస్ పాయింట్స్.

123తెలుగు రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు