చైనాలో విడుదలకు సిద్దమైన ‘బాహుబలి -2’ !

చైనాలో విడుదలకు సిద్దమైన ‘బాహుబలి -2’ !

Published on Mar 20, 2018 3:41 PM IST

దేశ వ్యాప్తంగా ఉన్న పాత సినిమాల కలెక్షన్ల రికార్డులన్నిటినీ కొల్లగొట్టి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1600 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన చిత్రం ‘బాహుబలి-2’. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో తెలుగు సినిమాల మార్కెట్ దేశవ్యాప్తమైంది. ఇప్పటికీ ఇండియాలో ఈ సినిమా హిందీ వెర్షన్ క్రియేట్ చేసిన రికార్డును మరే హిందీ చిత్రం అధిగమించలేకపోయింది.

అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు చైనా దేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పనులు కూడ పూర్తికాగా త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ‘బాహుబలి-1’ ను చైనాలో విడుదలచేసిన ఈస్టార్ మీడియానే విడుదలచేయనుంది. ఇకపోతే ఇండియన్ సినిమాలు ‘దంగల్, భజరంగీ భాయి జాన్’లు ఇదివరకే చైనాలో విడుదలై మంచి విజయాల్ని అందుకున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు