స్తంభించిన తమిళ సినీ పరిశ్రమ !

స్తంభించిన తమిళ సినీ పరిశ్రమ !

Published on Mar 19, 2018 2:06 PM IST


డిజిటల్ ప్రొవైడర్ల వివాదం పరిష్కారం కాకపోవడంతో తమిళ సినీ పరిశ్రమ మార్చి 16 నుండి బంద్ ను
పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చెన్నై నగరంలో మినహా చాలా చోట్ల థియేటర్లు మూసివేయబడ్డాయి. అంతేగాక నిర్మాతలు మండలి ఆదేశాలు మేరకు లోకల్, అవుట్ డోర్లలో జరిగే కొత్త సినిమాల చిత్రీకరణలు పూర్తిగా నిలిచిపోయాయి.

చిత్రీకరణ పూర్తైన సినిమాల పోస్ట్ ప్రోడక్షన్ పనులు నిలిచిపోగా సెన్సార్ బోర్డు కూడ సినిమాలు సెన్సార్ పనులను నిలిపివేసింది. దీంతో ఆడియో, ట్రైలర్ విడుదలలు, కొత్త సినిమాల ప్రకటనలు ఆగిపోయాయి. ఈ కారణాలతో చాల సినిమాలు అనుకున్న సమయానికి పూర్తికాక విడుదల ఆలస్యం కానున్నాయి. మరి సమస్యకు పరిష్కారం ఎప్పుడు, ఎలా దొరుకుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు