ప్యార్ మే పడిపోయానే పై ఆది ఆశలు

Aadi-Shanvi-Pyar-Mein-Padip

ఆది శాన్వి జంటగా నటించిన ‘ప్యార్ మే పడిపోయానే’ మే 10 న విడుదల కావడానికి సిద్ధం గా వుంది. ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం లో ఆది ఒక మ్యూజిషియన్ పాత్ర ని పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించారు.

ఒక ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ “దర్శకుడు చెప్పిన కధ చాలా కొత్తగా వుంది. సినిమాలో చాలా చోట్ల కామెడి బాగా పేలింది. ప్రతీ సీన్ కొత్తగా తీయడానికి ప్రయత్నించారు. వీక్షకులకు కొత్తగా కనిపించడంలో అతిశయోక్తికాదు. సినిమాలో క్లైమాక్స్ తెరకెక్కించిన విధానం మర్చిపోలేనిది. సినిమాకు అదే ప్రధాన ఆకర్షణ” అని తెలిపాడు

అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. సుకుమారుడు సినిమాతో ఆది బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డాడు. ఇదేకాక గాలిపటం, రఫ్ సినేమలలో కూడా ఆది నటిస్తున్నాడు

Exit mobile version