
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని మార్పులు చూస్తుంటే కొత్త సంచనాలకు శ్రీకారం చుడుతున్నట్టు కనిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న ‘రభస’ షూటింగ్ పూర్తి కాగానే పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించనున్నాడు.
ఈ సినిమా కోసం పూరి కథను కూడా సిద్దం చేసాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ మొదటి సారి వేరే రైటర్ రాసిన కథకి దర్శకత్వం వహించానున్నాడని అంటున్నారు. ఆ రైటర్ ఎవరో కాదు ఇప్పటికే పలు హిట్లు అందుకున్న వక్కంతం వంశీ. పూరి కెరీర్లో ఇలా వేరే వారి కథకి దర్శకత్వం వహించడం ఇదే మొదటి సారి కావడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
అన్నీ అనుకున్న టైం కి సెట్ అయితే ఈ సినిమా ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.