
వై.యెస్. ఆర్.సి.పి పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన రోజ భావోద్వేగానికి గురి అయ్యారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత రోజ ఉద్వేగం గా మాట్లాడుతూ తనకి ఎంతో సహకారాన్ని అందించిన తన పార్టీ అధ్యక్షుడు వై.యెస్.జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.
గతం లో తెలుగుదేశం పార్టీ లో వున్నా రోజ తర్వాత కాంగ్రెస్ లోకి మారారు. వై.యెస్.రాజ శేఖర్ రెడ్డి మృతి తర్వాత జగన్ ప్రారంభించిన వై.యెస్. ఆర్.సి.పి లో చేరిన రోజా ఆది నుంచి ఎన్నోఒడిదుడుకులని ఎదుర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా వై.యెస్. ఆర్.సి.పి కార్యక్రమాల్లో పాల్గొంటున్న రోజ తన పార్టీ కోసం చురుకుగా ప్రచారం చేసారు. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తి తో ఉత్సాహం గా వున్నా రోజ తిరిగి గాడి లో పడ్డారు.
123తెలుగు తరపున రోజా కు హార్దిక శుభాకాంక్షలు.