
నిన్న ప్రకటించిన 2014 ఎన్నికల ఫలితాల లో వచ్చిన విజయాన్ని బాలకృష్ణ అశ్వాదిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఇంకా పేరు పెట్టని ఒక తాజా చిత్రం కొత్త దర్శకుడు సత్య దేవా తో కలసి పని చేయనున్నారు. అయితే ఈ చిత్రం లో త్రిష ని హీరోయిన్ గా తీసుకుందామనుకుంటున్నారు.
ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. అయితే త్రిష దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఎస్.ఎల్.వి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య పుట్టిన రోజు అయిన జూన్ 10 న లాంచ్ చేయనున్నారు. 2014 బాలయ్య కి రాజకీయాలు మరియు సినిమాలు రెండిట్లోను కలసి వచ్చింది.