సంక్రాంతికి విడుదల కానున్న ఎన్టీఅర్ – పూరి సినీమా

NTR-and-Puri
తన సినిమాలకు తానే కథను రాసుకునే దర్శకుడు పూరి జగన్నాథ్ మొదటి సారి వేరే వాళ్ళు రాసిన కథను డైరెక్ట్ చేయబోతున్నాడు. పూరి తన తదుపరి సినిమాకి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ రాసిన, ఎన్టీఅర్ హీరోగా నటిస్తున్న సినిమా ని తీయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినీమా షూటింగ్ మే నెలాఖరులో మొదలుకానుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2015 జనవరి 9న విడుదలకానుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇంతకు ముందు పూరి జగన్నాథ్ ఎన్టీఅర్కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఆంధ్రావాల’.

Exit mobile version