
చెన్నైలో పెరిగిన ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫుల్ గర్ల్ చాందిని ‘కాళి చరణ్’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఆఫర్స్ రావు అనుకున్న ఈ భామ కిట్టీలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా టైటిల్ ‘ఎపి02’. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా టైటిల్ ఓ పోలీస్ స్టేషన్ నెంబర్.
ఈ సినిమా గురించి చాందిని మాట్లాడుతూ ‘ ‘ఎపి02’ సినిమాలో తన పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మనసుకు హత్తుకుంటూ ఎంతో ఎమోషనల్ గా నాగే లవ్ స్టొరీ. భూపాల్ హీరోగా చేస్తున్నాడు. ఇది కాకుండా మారుతి నిర్మాతగా చేస్తున్న ‘లవర్స్’ సినిమాలో సాయి పక్కన జోడీ కడుతున్నాను. ఇందులో సుమంత్ అశ్విన్ – నందిత కూడా ఉన్నారు. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని’ తెలిపింది.
ఇది రెండు కాకుండా అనిరుధ్ హీరోగా హారిక్ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన సినిమా ‘కిరాక్’ లో కూడా చాందిని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూలై 2వ వారంలో రిలీజ్ కానుంది. ‘కిరాక్’ లో గ్లామరస్ కాలేజ్ గర్ల్ పాత్రలో కనిపించనున్న చాందిని పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తే, హీరో అనిరుధ్ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నాడు.