యాక్టింగ్ అందరూ అనుకున్నంత ఈజీ కాదంటున్న సత్య దేవ్

sathya-dev

ప్రదీప్ దర్శకత్వం వహించిన ‘మైనే ప్యార్ కియా’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నటించిన వైజాగ్ కి చెందిన తెలుగు కుర్రాడు సత్య దేవ్ చిన్న వయసులో ఇషా తల్వార్ కి అంకుల్ గా 40 ఏళ్ళ పాత్రలో కనిపించనున్నాడు. బి టెక్ చదివిన ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో ఓ ఐటి కంపెనీలో పార్ట్ టైం జాబు చేస్తూ ఫుల్ టైం సినిమాలకే కేటాయించాడు. గతంలో Mr పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన సత్య దేవ్ కి మైనే ప్యార్ కియాలో ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది.

సత్య దేవ్ ఈ సినిమా మరియు తనకి వచ్చిన ఆఫర్ గురించి చెబుతూ ‘ప్రదీప్ నాకు చాలా మంచి రోల్ ఇచ్చాడు. నేను ఇషా తల్వార్ అంకుల్ గా నటించాను. నాకు ఎక్కువ వయసు ఉన్న పాత్రలో నటించడం ఇబ్బంది లేదు. 15 సంవత్సరాలు కోమాలో ఉండి బయట వచ్చిన పాత్ర నాది’ అన్నాడు.

అలాగే మాట్లాడుతూ ‘నేను ఎప్పటికన్నా సినిమాల్లోనే ఉండాలనుకుంటున్నాను. అందుకు మొదట నన్ను నేను నిరూపించుకోవాలి. నాకు మెథడ్ యాక్టింగ్ ఫాలో అయ్యే నజీరుద్దీన్ షా స్ఫూర్తి, నేను ఆయనలా ప్రాక్టీస్ చెయ్యలేదు కానీ దానిపై వర్కౌట్ చేస్తున్నాను. అందరూ యాక్టింగ్ చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం అని’ అన్నాడు.

Exit mobile version