యాక్షన్ మోడ్ లో ఉన్న మహేష్ బాబు

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం విలన్స్ ని ఇరగదీసే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు చేస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం బళ్లారిలో జరుగుతోంది. అక్కడ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ జూలై 2 వరకూ అక్కడే జరగనుంది. ఈ మధ్యలో జూన్ 28న బళ్లారిలో జరగనున్న ‘దూకుడు’ కన్నడ రీమేక్ ‘పవర్’ ఆడియో లాంచ్ కి హాజరు కానున్నాడు.

బళ్లారిలో షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక ఈ చిత్ర టీం హైదరాబాద్ కి తిరిగి రానుంది. హైదరాబాద్ వచ్చాక శృతి హాసన్ పై వచ్చే ఓ ఐటెం సాంగ్ ని షూట్ చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version