డీసెంట్ ఓపెనింగ్స్ తో ‘రా రా కృష్ణయ్య’.


ఈ శుక్రవారం విడుదలైన సందీప్ కిషన్ ‘రా రా కృష్ణయ్య’ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ సాదించింది. సందీప్ గత సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తరహాలో ఈ సినిమాకు కూడా మౌత్ టాక్ బాగుంది. క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ తో పాటు ఆడియన్స్ పబ్లిక్ టాక్ కూడా బాగుండడంతో కృష్ణుడు(సందీప్ కిషన్) చాలా సంతోషంగా ఉన్నాడు. విడుదలైన అన్ని సెంటర్లలో కలెక్షన్స్ బాగున్నాయని సమాచారం.

‘రా రా కృష్ణయ్య’ సినిమాలో కొందరికి సందీప్ కిషన్, రెజినాల లవ్ ట్రాక్ నచ్చితే, మరికొందరికి సందీప్, జగపతి బాబుల మధ్య సన్నివేశాలు నచ్చాయి. సినిమాటోగ్రఫీ, అచ్చు సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ బరిలో మరో సినిమా పోటి లేకపోవడం కూడా ‘రా రా కృష్ణయ్య’ సినిమాకు హెల్ప్ అయ్యింది.

Exit mobile version