
గత నెల రోజులుగా తన బేబీ విద్య నిర్వాణతో బిజీ బిజీగా సమయాన్ని గడిపిన లక్ష్మీ మంచు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. రియల్ లైఫ్లో లానే ‘బుడుగు’ సినిమాలో కూడా లక్ష్మీ మంచు ఓ తల్లి పాత్ర పోషిస్తున్నారు.
ఒక తల్లిగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ ‘ పేరెంట్స్ గా ఉండడం చాలా కష్టం. ఒక బేబీని నలుగురు చూసుకోవాలి. నేను లేనప్పుడు అండీకి లేదా ఎవరు అయితే నా బేబీని చూసుకున్తున్నారో వారికి కాల్ చేస్తూనే ఉంటాను. ఈ విషయంలో నా ఫ్యామిలీ నాకు పూర్తి సపోర్ట్ ఇస్తోందని’ తెలిపింది. ‘నీ బేబీ నీ లైఫ్ లో ఒక పార్ట్. అలా అని నీ కెరీర్ ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు కాస్త అలోచించి మేనేజ్ చేసుకోవాలి. యుఎస్ లో వర్క్ ని ఎంతో డెడికేట్ గా చేస్తారు. చాలా రేర్ గా బ్రేక్ తీసుకుంటారు డెలివరీ ఉన్నా అలానే చేస్తారు. అందుకే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారని’ లక్ష్మీ మంచు అంటోంది.