
విశాల్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘పూజై’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ క్లైమాక్స్ ప్రస్తుతం బీహార్ లో జరుగుతుంది. బీహార్ లో ప్రముఖ రాజకీయ నాయకుడు ఒకరు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. 10 రోజుల పాటు ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దాంతో దాదాపు టాకీ పార్ట్ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలను చెన్నై, హైదరాబాద్, స్విట్జర్లాండ్ లలో చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, ముకేష్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా డబ్బింగ్ చేయనున్నారు.