సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో నవీన్. సీనియర్ హీరో నరేష్ తనయుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న నవీన్ ఫస్ట్ మూవీతోనే తన మార్క్ చూపాలని భావిస్తున్నాడు. కృష్ణవంశి అసిస్టెంట్ రామ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం 6 ప్యాక్ బాడీ బిల్డ్ అప్ చేశాడు. స్వతహాగా మంచి ఎడిటర్ అయిన నవీన్ యాక్టింగ్, డాన్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాడు. ‘1 నేనొక్కడినే’ సినిమా కోసం మహేష్ 6 ప్యాక్ చేశాడు. కాని తెరపై చూపించలేదు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’లో సుధీర్ బాబు 6 ప్యాక్ లో సందడి చేశారు.
ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై నవీన్ హీరోగా రామ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఓపెనింగ్ ఈ రోజు రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ & మహేష్ బాబు క్లాప్ కొట్టారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి సన్నివేశానికి విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నవీన్ హీరోగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
నవీన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుంది. రెండు పాటలు, మరికొన్ని సన్నివేశాలను ఫారిన్ లొకేషన్లలో షూట్ చేయడానికి ప్లాన్ చేశామని నిర్మాతలలో ఒకరైన అడ్డాల చంటి చెప్పారు. పార్ధ సారధి మరొక నిర్మాత.
