యంగ్ హీరో శర్వానంద్ లవర్ బాయ్ లుక్ లో, పూర్తి కామెడీ పాత్రలో కనిపించిన సినిమా ‘రన్ రాజా రన్’. జూలై 27న విడుదలైన ఈ సినిమాకి సూపర్ హిట్ అనే మౌత్ పబ్లిసిటీ రావడంతో విడుదలిన అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ బాగా రాబట్టుకుంటోంది. లాగే డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. సినిమా రిలీజ్ అయ్యి నేటికి 10వ రోజు అయినా ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ అవ్వలేదు.
10వ రోజు కృష్ణ జిల్లాలో ‘రన్ రాజా రన్’ సుమారు 3 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. అలాగే ఒక్క కృష్ణలోనే 10 రోజుల్లో సుమారు 35లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఓవర్సీస్ లో 10 రోజుల్లో $2,22,000 షేర్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా మొదట రిలీజ్ అయిన దానికంటే హిట్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్స్ కూడా బాగా పెరిగాయి.
శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా సుజీత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘మిర్చి’ సినిమా అందించిన వంశీకృష్ణ రెడ్డి – ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.
