అవయవదానం చేసిన అసిన్

Asin

సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయ్యి ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ మళయాళ కుట్టి అసిన్. ఎప్పుడూ సోషల్ సర్వీస్ చేయడంలో ముందు ఉండే ఈ భామ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అదే అవయవ దానం. అసిన్ మాట్లాడుతూ ‘చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. తన కళ్ళని, అవయవాలను డొనేట్ చేసానని’ తెలిపింది. అందరూ మంచి సొసైటీ కోసం అవయవదానం చేయాలని అంటోంది.

అసిన్ ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ సరసన చేస్తున్న ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ‘బోల్ బచ్చన్’ సినిమాలో అభిషేక్, అసిన్ అక్క తమ్ముడుగా కనిపించారు కానీ ఇందులో హీరో హీరోయిన్స్ గా రోమాన్స్ చేయనున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తన చాటుకోవాలని అసిన్ బాగా ట్రై చేస్తోంది.

Exit mobile version