‘గజినీ’ మేజిక్ ని రిపీట్ చేయనున్న సూర్య

Very_Happy_Surya
సూర్య, ఇతను తమిళంలో ఓ స్టార్ హీరో కానీ సూర్యకి ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే సూర్య సినిమాలు సౌత్ లోని అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతూ ఉంటాయి. సూర్య నటించిన ‘అంజాన్’ సినిమా ఈ శుక్రవారం అనగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘అంజాన్’ రిలీజ్ కి ముందే సూర్య తన తదుపరి సినిమా ‘మాస్’ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా సూర్య గజినీ మేజిక్ ని రిపీట్ చేయనున్నాడు. గజినీ మూవీలో అందరికీ కనెక్ట్ అయిన పాయింట్స్ రెండు.. అందులో ఒకటి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్, రెండవది ట్విన్స్ గా విలన్ డబుల్ రోల్. గజినీలో క్లిక్ అయిన విలన్ డబుల్ రోల్ ని సూర్య మాస్ సినిమాలో కూడా ఉపయోగించనున్నాడు.

ఈ సారి సూర్యకి గట్టి పోటీని ఇచ్చే విలన్ పాత్రలో డైరెక్టర్, నటుడు అయిన సముద్రఖని నటిస్తున్నాడు. ఈ విలన్ మేజిక్ మరోసారి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఈ మూవీలో సూర్య సరసన నయనతార, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version