
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. మే ‘మనం’ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య జూన్ చివర్లో ఆటోనగర్ సూర్య గా మెప్పు పొందాడు. అది రిలీజ్ అయిన మూడు నెలల గ్యాప్ లోనే ‘ఒక లైలా కోసం’ సినిమాని పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. ఆగష్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కాకుండా నాగ చైతన్య ‘స్వామి రారా’ డైరెక్టర్ సుధీర్ వర్మ తో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. జూలై మొదట్లో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో నాగ చైతన్య సరసన హీరోయిన్ కోసం ‘1-నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘మాయగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. అలాగే ఈ చిత్ర టీం అంతా కూడా ఈ టైటిల్ పైనే ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
అత్తారింటికి దారేది సినిమా తర్వాత శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నాడు. మొదటి సినిమాతో అందరినీ మెప్పించిన సుధీర్ వర్మ ఈ సినిమాతో కూడా అందరినీ మెప్పిస్తాడేమో చూడాలి..